- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ వేలంలో కనీసం 75 శాతం ఖర్చు చేయాల్సిందే : బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: వీవో ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ఈ నెల 18న చెన్నైలో జరుగనున్నది. కాగా, ఈ వేలంలో పాల్గొనడానికి ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక నిబంధన విధించింది. అన్ని ఫ్రాంచైజీలు కనీసం 75 శాతం వ్యాలెట్‌ను ఉపయోగించాలంటూ లేఖ రాసింది. ప్రస్తుతం పర్స్ వాల్యూ రూ. 85 కోట్లగా ఉండగా.. ఇందులో 75 శాతం మొత్తాన్ని వేలంలో వాడాల్సిందేనని లేఖలో పేర్కొన్నారు. అంటే ప్రతీ ఫ్రాంచైజీ రూ. 63.75 కోట్లను ఉపయోగించాలి. ఇప్పటికే ఉన్న ప్లేయర్స్ వాల్యూతో కలుపుకొని ఈ మినిమం వాల్యూను లెక్కించనున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఉన్న సభ్యుల పరంగా రూ. 31.8 వాల్యూ ఉన్నది. అంతే ఈ ఫ్రాంచైజీ వేలంలో కనీసం మరో 31.95 కోట్లను ఆటగాళ్ల కొనుగోలు కోసం కచ్చితంగా ఉపయోగించాల్సి ఉంది. ఒక్క సీజన్ కోసం అంత భారీ మొత్తాన్ని పెట్టడానికి పంజాబ్ యాజమాన్యం నిరాకరిస్తున్నది. అయితే ఈ నిబంధన మొదటి నుంచి అమలులో ఉన్నదనే విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తోంది.