- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు'
దిశ, భువనగిరి: పక్క రాష్ట్రాలలో కోవిడ్ భాదితులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవాలందిస్తుంటే తెలంగాణలో కరోనా పై తప్పుడు బులెటిన్ విడుదలచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్థంతిని పురస్కరించుకొని యాదాద్రి-భువనగిజిల్లా భువనగిరి పట్టణంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బిబినగర్ నిమ్స్, భువనగిరి ఏరియా ఆసుపత్రులకు 25 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని, కరోనా కట్టడి కోసం కోసం ఇతర రాష్ట్రాల్లో ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంటే మన ముఖ్యమంత్రి కనీసం టెస్ట్ లు కూడా సరిగ్గా చేయించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ హాస్పిటల్లో రోజుకు 70 మంది చనిపోతుంటే కేవలం 30-40 మరణాలను లెక్క చూపిస్తున్నారని ఆరోపించారు.తన ఏడేళ్ల పదవీ కాలంలో ముఖ్యమంత్రి హోదాలో గాంధీ ఆసుపత్రిని సందర్శించని సీఎం మంత్రి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత గాంధీని సందర్శించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కోలుకుంటున్న పేషంట్లను పరామర్శించి కోవిడ్ భాదితులను పరామర్శించానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో రోజుకు వందలాదిమంది చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, కరోనా మహామ్మారిని ఆరోగ్యశ్రీ లో చేర్చడంతో పాటు కార్పొరేట్ ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్య సేవలందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి-భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.