- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో సీఎం ఉన్నాడా? లేడా?
దిశ ప్రతినిధి, నల్లగొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసేస్తే.. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భువనగిరిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా? లేడా? అన్న సందేహం వస్తుందన్నారు.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి జగదీష్‌రెడ్డి రావడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడబోనన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ రాజీపడ్డా.. తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామానికి చెందిన వారు అమెరికాలో ఉన్నా.. వారికి నష్టపరిహారం డబ్బులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. యాదగిరిగుట్టలో దుకాణాలు, ఇండ్లు కోల్పోయిన వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
సాగర్ ఎన్నికలో గెలుపు కోసమే నిధులు మంజూరు చేస్తున్నారని.. ఇన్నేండ్లుగా గుర్తుకురాని గొర్రెల పంపిణీని సైతం ప్రజలను మభ్యపెట్టేందుకేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో మత రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు. జిల్లా మంత్రి భువనగిరిని పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయమని తెలిపారు. ఫామ్‌హౌస్ రోడ్డు కోసం యాదగిరిగుట్టలో దుకాణాలు, ఇండ్లు కోల్పోయిన బాధితులకు అన్యాయం చేశారన్నారు. మూడేండ్ల నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేక 4 వేల పాఠశాలలు మూతపడ్డాయని, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని వివరించారు. రాజ్‌భవన్ ముట్టడికి పోలీసులు అడ్డుపడ్డా వెనక్కి తగ్గేది లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.