- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూటాన్ టీకా సక్సెస్ స్టోరీ : వారంలో 62శాతం పౌరులకు వ్యాక్సిన్
థింపు : వెనుకబడ్డ దేశంగా పేర్కొనే భూటాన్ టీకా పంపిణీలో ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన వారం రోజుల్లోనే 62శాతం మంది అర్హులైన పౌరులకు టీకా వేసి అమెరికా, యూకేలనూ బీట్ చేసింది. ఫక్తు ఆర్థిక లెక్కలతో కాకుండా హ్యాపినెస్ ఇండెక్స్‌తో అభివృద్ధిని కొలిచే భూటాన్ గతనెల 27న టీకా పంపిణీ ప్రారంభించింది. వారంలో 62శాతం మంది పౌరులకు టీకా వేసింది. మంగళవారం నాటికి దేశ జనాభా 735,553లో 469,664 మందికి అంటే 85శాతం మందికి(పిల్లలను మినహాయించి) టీకా పంపిణీ చేసింది.
కలిసొచ్చిన భారత్, చైనా వైరం
ఈ రికార్డుకు దేశ జనాభా తక్కువగా ఉండటమే కారణం కాదు. దీనికి టీకా పంపిణీలో పాలుపంచుకోవడానికి స్వయంగా ముందుకు వచ్చిన వాలంటీర్లు, పటిష్టమైన ప్రణాళికలతోపాటు దక్షిణాసియాలో భారత్, చైనాల మధ్య వైరం కూడా కలిసివచ్చింది. భూటాన్‌పై చైనా ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా వ్యాక్సిన్ డిప్లమసీ పేరిట భారత్ భూటాన్‌కు 6,00,000లక్షల ఆస్ట్రాజెనెకా టీకా డోసులను ఉచితంగా పంపించింది. పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులూ సరఫరా చేసింది. ఇలా కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాక్సినేషన్ తొలి సక్సెస్ స్టోరీకి కేరాఫ్‌గా భూటాన్ నిలవనుంది. కథ ఇక్కడితో ముగియలేదని, రెండో డోసుపట్ల యోచిస్తున్నామని అధికారులు చెప్పారు. వాస్తవానికి కరోనా మహమ్మారి ప్రబలడానికి ముందు భూటాన్‌లో 37 మంది వైద్యులు మాత్రమే ఉండేవారు. ఫుల్‌టైమ్ వర్క్ చేసే హెల్త్‌కేర్ వర్కర్లు మూడు వేలకు మించి లేరు. కానీ, పటిష్ట ప్రణాళికతో టీకా పంపిణీని సక్సెస్ చేయగలిగారు.