ఇమ్రాన్ హష్మి, టీ-సిరీస్ నుంచి మరో సింగిల్

by Jakkula Samataha |
ఇమ్రాన్ హష్మి, టీ-సిరీస్ నుంచి మరో సింగిల్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌ ఇమ్రాన్ హష్మి, టీ సిరీస్ అధినేత భూషన్ కుమార్‌ది హిట్ కాంబినేషన్‌. 2015లో వీరిద్దరి కొలాబరేషన్‌లో వచ్చిన ‘మై రహూ యా న రహూ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య రిలీజైన ‘లూట్ గయే’ సింగిల్ కూడా మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఈ రెండు పాటలను పాడింది సింగర్ జుబిన్ నౌతియాల్ కాగా, అతనితో ఏడాది కాలంలో 12 సింగిల్స్ పాడించినట్టు భూషన్ కుమార్ వెల్లడించారు.

ఈ పాట తమ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి హిట్ అయ్యిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ హష్మితో మరో సింగిల్‌కు ప్లాన్ చేస్తున్నామని, ఈ సాంగ్ కూడా జుబిన్‌తోనే పాడిస్తామని ఆయన తెలిపారు. ‘లూట్ గయే’ సక్సెస్ తర్వాత ఇమ్రాన్.. మాతో ప్రతి రెండు మూడు నెలలకో సాంగ్ చేయాలనుకుంటున్నాడని, ప్రస్తుతం మూడో సింగిల్‌కు సంబంధించిన షూట్‌ను ఒకటి, రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామని కన్‌ఫర్మ్ చేశారు.

Advertisement

Next Story