అందులో.. భూపాలపల్లి కి 14వ ర్యాంక్

by Shyam |
అందులో.. భూపాలపల్లి కి 14వ ర్యాంక్
X

దిశ, భూపాలపల్లి: నీతి అయోగ్ ర్యాంకింగ్స్‌లో భూపాలపల్లి జిల్లా దేశంలో 14 వ ర్యాంకు సాధించడంపై అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఆదివారం అభినందించారు. 2020 జూన్ మాసానికి నీతి అయోగ్ ప్రకటించిన అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ర్యాంకింగ్‌లో వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహార కల్పన, విద్య, వ్యవసాయం అనుబంధ రంగాలు, నీటి వసతుల కల్పన, ఆర్థిక స్వాలంబన, నైపుణ్యాల పెంపుదల, మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధిని సాధించి దేశవ్యాప్తంగా భూపాలపల్లి 14 వ ర్యాంకు సాధించడంపై కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన జిల్లా అయినా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరుపేదల వద్దకు తీసుకెళ్లి వారిని భాగస్వామ్యం చేసారన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ జిల్లా అభివృద్ధిలో నీతి అయోగ్ సూచించినట్టుగా విద్య, వైద్యం, పౌష్టికాహార కల్పన, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు, యువతకు నైపుణ్య శిక్షణ, ఆర్ధిక తోడ్పాటు, మౌళిక వసతుల కల్పనకు కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషిని అభినందించారు. ఆయా రంగాల్లో ప్రగతి సాధించడంతో నీతి అయోగ్ ర్యాంకు పొందామని, ఇదే విధమైన స్ఫూర్తిని నిరంతరం కనపరుస్తూ జిల్లా సంపూర్ణ అభివృద్ధికి అధికారులు అంకితం కావాలని కలెక్టర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed