భోజ్‌పురి నటి ఆత్మహత్య…

by  |
భోజ్‌పురి నటి ఆత్మహత్య…
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వరుసగా నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్(40) ఆగష్టు 2వ తేదీన ముంబైలోని దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆత్మహత్యకు ముందు ఆమె ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టింది. ఈ సందర్బంగా ఆమె లైవ్‌లో మాట్లాడుతూ… అందరికీ విశ్వాసపాత్రులుగా ఉండండి, కానీ ఎవరినీ నమ్మకండి. ఇది నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అని, ప్రజలు స్వార్థ పరులు అని, ఇతరులను ఎవరూ పట్టించుకోరు అని చెప్పింది.



Next Story