- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘భీమిలి టు భోగాపురం’ పారిశ్రామిక వాడకు గ్రీన్‌సిగ్నల్

దిశ, ఏపీ బ్యూరో: భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం దాకా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. సుమారు 20కిలోమీటర్ల పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసే బాధ్యతను కేఅండ్‌జే సంస్థకు అప్పగించింది. డీపీఆర్ తయారీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ బిడ్‌లను ఆహ్వానించగా మొత్తం నాలుగు సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో అతి తక్కువ ధర కోట్ చేసి ఎల్1గా నాగపూరుకు చెందిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ సంస్థ నిలిచినట్లు ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ ఆర్ పవనమూర్తి తెలిపారు. సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్, కేఅండ్‌జే ప్రాజెక్ట్స్, ట్రాన్స్‌లింక్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తుది బిడ్‌కు ఎంపికయ్యాయి. వీటిలో రూ.41లక్షలు కోట్ చేసిన కేఅండ్‌జే సంస్థ ఎల్1గా నిలిచింది.