భెల్ నికర నష్టం రూ. 893 కోట్లు

by  |
భెల్ నికర నష్టం రూ. 893 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్, లాక్‌డౌన్ ప్రభావం కార్యకలాపాలపై ప్రతికూలంగా ఉండటంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ నిర్వహణ ఇంజనీరింగ్ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) రూ. 893.14 కోట్ల నికర నష్టాల (Net losses)ను వెల్లడించింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 218.93 కోట్ల నికర నష్టాల (Net losses)ను నమోదు చేసినట్టు భెల్ (BHEL)తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,086.43 కోట్లుగా ఉన్నట్టు, గతేడాది ఇదే త్రైమాసికానికి కంపెనీ మొత్తం రూ. 4,673.38 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌ (Regulatory Filing)లో పేర్కొంది.

కొవిడ్-19 (Kovid-19) వ్యాప్తితో లాక్‌డౌన్ విధించడం వల్ల ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపా ప్రభావితమై ఆర్థిక ఫలితాలు ప్రతికూలంగా నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది. అలాగే, అత్యంత జాగ్రత్తల మధ్య కార్యకలాపాలు క్రమంగా తిరిగి ప్రారంభమయ్యాయి. పరిమితమైన కార్మికులు ఉండటం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్నదని కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed