- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#BheemlaNayak: నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా.. స్టేషన్‌లో టాక్ నడుస్తోంది
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లానాయక్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. మాలీవుడ్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే భీమ్లా నాయక్‌గా పవన్ లుక్ అండ్ స్టైల్ రిలీజై వైరల్ కాగా.. తాజాగా రానా లుక్ విడుదల చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంలో రానా.. డానియల్ శేఖర్‌గా నటించబోతుండగా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా.. స్టేషన్‌లో టాక్ నడుస్తోంది. నేను ఎవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో.. హీరో.. డానియల్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్ నం.1’ అంటూ మాస్ డైలాగ్‌తో ఉన్న క్లిపింగ్‌లో రానా యాటిట్యూడ్ అదిరిపోగా.. క్యారెక్టర్‌కు కరెక్ట్‌గా సెట్ అయ్యాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. భీమ్లానాయక్, డానియల్ శేఖర్ మధ్య రచ్చతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోనుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం 2022 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.