- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై భట్టి ఫైర్.. మీ ఇద్దరికి చావు డప్పు మోగిస్తామంటూ హెచ్చరిక..
దిశ, ముదిగొండ: ముదిగొండ మండల చిరుమర్రి గ్రామంలో కాంగ్రెస్ మూడవ ప్లీనరీ సమావేశంలో మధిర ఎమ్మెల్యే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుందన్నారు. రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో వరి వెయ్యొద్దు, వరి వేస్తే ఉరి అంటే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని బజారుకెక్కి ధర్నాలు చేయడం, చావు డప్పు మోగించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు ధాన్యం కొనకపోతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చావు డప్పు మోగిస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వాలు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నోటిఫికేషన్ లు వేయకుండా విద్యార్థుల ఆత్యహత్యలకు కేసీఆరే కారణం అవుతున్నారని పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు కల్పించుకున్నారని ఎద్దేవా చేశారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.