- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్‌ను ఖండిస్తున్నాం: భట్టి విక్రమార్క
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ప్రజల అరచేతిలో నక్షత్రాలు చూయించినట్లు ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. 2014 నుంచి 2020-21 బడ్జెట్ లెక్కలు చూస్తే గ్రోత్ అర్ధమవుతుందన్నారు. ఆదాయాలు బాగా ఉన్నా బడ్జెట్ గ్రోత్ మాత్రం 15శాతం మాత్రమే ఉందన్నారు.
ఒక పక్కన ఆర్థిక మాంద్యం ఉందంటూనే.. ఈ సారి 25శాతం గ్రోత్ చూపిస్తున్నారన్నారు. వాస్తవానికి బడ్జెట్ ఏ మాత్రం ప్రజలకు దగ్గరగా లేదని తెలిపారు. గత సంవత్సరం బడ్జెట్ కంటే 25శాతం పెంచి ప్రజలను మాయ చేస్తున్నారని భట్టి ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు చేస్తున్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమయ్యాయని.. ఉద్యోగాలు, మూడెకరాల భూమి ఎక్కడా కనపించలేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని భట్టి విక్రమార్క తెలియజేశారు.
tag: bhatti vikramarka, allegations, budget, assembly