కరోనా వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన..

by  |
కరోనా వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని దేశంతో పాటు ప్రజలు, కరోనా బాధితులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా మందుపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ మొదటి దశను ఈనెల 15న ప్రారంభించామని తెలిపింది. 375మందితో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తొలిదశ క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్లను 14 రోజుల పాటు పరిశీలించనుండగా…అనంతరం 750మందితో భారత్ బయోటెక్ రెండో విడత ట్రయల్స్ నిర్వహించనుందని ఆ సంస్థ ప్రకటించింది.


Next Story

Most Viewed