భారత్, చైనా సంయమనం పాటించాలి

by  |
భారత్, చైనా సంయమనం పాటించాలి
X

దిశ, వెబ్‌డెస్క్ :

భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిచారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీయకుండా భారత్ చూసుకోవాలని వాంగ్ యీ సూచించారు.

అదే విధంగా భారత్‌తో శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇండో-చైనా సరిహద్దుల్లో తాము ఎప్పుడూ సుస్థిరతకే ప్రాధాన్యమిస్తామని.. ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భారత్‌తో సామరస్యపూర్వక చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి పునరుద్ఘాటించారు.


Next Story