ఈ నెల 26న భారత్ బంద్

by Shamantha N |   ( Updated:2021-04-13 03:56:43.0  )
ఈ నెల 26న భారత్ బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 26న భారత్ బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 1 నుంచి 25 వరకు ప్రజా ఉద్యమాల మాసంగా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ రెండు పేజీల లేఖను విడుదల చేసింది. అందులో శాంతి చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, ప్రభుత్వాలే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది.

CC stmt o

అసలు మావోయిస్టు పార్టీనే లేకుండా చేస్తామంటూ ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయంది. సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు జరుపుతాంటూ ప్రభుత్వాలు షరతు పెడుతున్నాయని, చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, జవాన్ల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed