బెజోస్ ఆస్తి మీద కరోనా ప్రభావం?

by vinod kumar |
బెజోస్ ఆస్తి మీద కరోనా ప్రభావం?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓవైపు ప్రపంచ దేశాలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయి ఆర్థికమాంద్యం అంచుల వరకు వెళుతుంటే, మరోవైపు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆస్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా వరుసగా మూడో సారి ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో మొదటిస్థానంలో నిలిచాడు. బెజోస్ ఆస్తి మొత్తం 113 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. ప్రస్తుతానికి 12 అంకెల ఆస్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి బెజోస్. రెండో స్థానంలో ఉన్న బిల్ గేట్స్ ఆస్తి కరోనా కారణంగా 98 బిలియన్ డాలర్లకు పడిపోవడమే ఇందుకు కారణం.

అయితే గత వేసవిలో తన ఆస్తిలో 36 బిలియన్ డాలర్ల అమెజాన్ స్టాక్‌ను తన మాజీ భార్య మెకంజీ బెజోస్‌కి ఇచ్చినప్పటికీ అతని మొత్తం ఆస్తిపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. 2019 చివరి త్రైమాసికంలో అమెజాన్ స్టాక్ 15 శాతం పెరగడమే ఇందుకు కారణం. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే… బెజోస్ ఇచ్చిన మొత్తంతో మెకంజీ బెజోస్‌ కూడా ఈ జాబితాలో మొదటిసారి స్థానం సంపాదించుకుంది. 36 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆమె 22వ స్థానంలో నిలిచింది. ఇంకా ఈ జాబితాలో మూడో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, నాలుగో స్థానంలో వారెన్ బఫెట్, ఐదో స్థానంలో లారీ ఎలిసన్ ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దాదాపు 267 మంది బిలియనీర్లు ఈసారి జాబితాలో స్థానం సంపాదించుకోలేకపోయాలరని పోర్బ్స్ తెలిపింది.

Tags : Amazon, Forbes, Jeff Bezos, Corona, covid, property

Advertisement

Next Story

Most Viewed