కరోనా టెస్టు చేయించుకోలేదని యువకులను చితకబాదారు.. వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2021-05-24 21:28:42.0  )
కరోనా టెస్టు చేయించుకోలేదని యువకులను చితకబాదారు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా టెస్టు చేయించుకోలేదని బృహత్​ బెంగళూరు మహానగర పాలక సంస్థ(బీబీఎంపీ) సిబ్బంది ఇద్దరు యువకులను చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. బెంగళూరులోని నాగరత్‌పేట్ టెస్టింగ్ కేంద్రంలో టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్‌లో వెయిట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన బీబీఎంబీ సిబ్బంది.. వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సిబ్బంది.. యువకులను దారుణంగా కొట్టారు. ఈ విషయం కాస్తా పోలీసులకు.. తెలియడంతో యువకులపై చేయి చేసుకున్న అధికారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story