ఆర్‌ఆర్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ నుంచి బెన్ స్టోక్స్ అవుట్..!

by Anukaran |
ఆర్‌ఆర్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ నుంచి బెన్ స్టోక్స్ అవుట్..!
X

దిశ, స్పోర్ట్స్ : తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోకి కీలక ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ చేతికి గాయం కావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అందుకున్నాడు. ఈ క్రమంలో బెన్‌స్టోక్స్‌ చేతికి తీవ్రమైన గాయమైనట్లు సమాచారం. లాంగాన్ నుంచి పరిగెత్తుతూ వెళ్లి బౌండరీ వద్ద డైవ్ చేసి క్యాచ్ పట్టిన సమయంలో చేయి విరిగినట్లు తెలుస్తున్నది. అతడికి గురువారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. బయోబబుల్ నుంచి బయటకు వచ్చిన బెన్‌స్టోక్స్‌కు ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఎక్స్‌రే, ఇతర పరీక్షలు నిర్వహిస్తారని బ్రిటిష్ మీడియా పేర్కొన్నది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం. స్టోక్స్ ఆరోగ్య విషయంపై ఈసీబీ వైద్య బృందం ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెటర్ గాయం కారణంగా రాజస్థాన్ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు బెన్‌స్టోక్స్ కూడా దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ.

Advertisement

Next Story