బ్రేకింగ్.. ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

by vinod kumar |
బ్రేకింగ్.. ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : రష్యాలో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బెలారస్ దేశానికి చెందిన కార్గో విమానం రష్యాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్టు సమాచారం. మరణించిన వారిలో ముగ్గురు బెలారస్‌కు చెందినవారు కాగా.. రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన వారు ఇద్దరిద్దరు ఉన్నారు.

వివరాల ప్రకారం.. బెలారస్​ వైమానిక దళానికి చెందిన ఏఎన్​-12 విమానం రష్యాలోని తూర్పుసెర్బియాలో ల్యాండ్ అయ్యే సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కుప్పకూలినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed