తేనెటీగల దాడిలో రైతు మృతి

దిశ వెబ్ డెస్క్:
ఖమ్మం జిల్లాలో తేనెటీగల దాడిలో ఓ రైతు మృతి చెందారు., వివరాల్లో కెళితే…..మాదారం గ్రామానికి చెందిన నల్లడి రామారావు అనే రైతు బుధవారం తన పొలానికి వెళ్లాడు. ఆయన పనిచేస్తున్న పొలం పక్కనే తేనెటీగలు తుట్టెను పెట్టాయి. కాగా అక్కడికి వచ్చిన కోతులు చెట్టు పైకి ఎక్కి కొమ్మను ఊపాయి. ఒక్కసారిగా తేనెటీగలు లేచి రామారావును కుట్టాయి. భయంతో రామారావు పరుగులు తీశాడు. దీంతో ఆయసానికి గురై గుండె ఆగి చనిపోయాడు.

Advertisement