బీర్ల అమ్మకాల తగ్గాయ్!

by  |
బీర్ల అమ్మకాల తగ్గాయ్!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ బీరు దినోత్సవం ( ఆగస్టు-07)న మందుబాబులు సంతోషంగా బీరేసే అవకాశం లేకుండా పోయింది. కారణం కరోనా మహమ్మారి. చల్లని బీర్లు, శీతల పానీయాలు తాగడం వలన వైరస్ ప్రభావం మరింత పెరుగుతోందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎలా అంటే.. తెలంగాణ మద్యం అమ్మకాల లెక్కలు చూస్తే అలానే ఉంది మరి పరిస్థితి. ఆల్కహాల్ బెవరేజస్‌లో విపరీతంగా అమ్ముడుపోయిన బ్రాండ్ ఏదైనా ఉందంటే అది బీరే. గతంలో సీజన్ ఏదైనా బీర్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. ఇక ఒక్కొక్కరు 3 నుంచి 6 బీరు బాటిళ్లు కొనుగోలు చేసేవారు.

కానీ, ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. బీర్‌కు ఇప్పుడు చాలా డిమాండ్ తగ్గింది. బీర్ తాగేవాళ్లు కూడా తగ్గారు. ఎందుకంటే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటం.. చల్లని బీర్ తాగితే జలుబు వచ్చే ఛాన్స్ ఉండటంతో భయంతో బీర్‌ను పక్కన పెడుతున్నారు బీరు బాబులు. అందువల్లే రాష్ట్రంలోని అన్ని నగరాల్లో బీరు విక్రయాలు గణనీయంగా తగ్గాయని వైన్ షాప్ ఓనర్లు అంటున్నారు.

ఇక ఒక హైదరాబాద్‌లో గతంలో కంటే చాలా మేర బీర్ అమ్మకాలు తగ్గాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు.నగరంలో బీర్ల విక్రయాలు తగ్గడానికి గల కారణాలను ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేశారు. కరోనా కారణంగా జన్మదిన, వివాహ ఇతరత్రా వేడుకలు, విందులు వాయిదా పడటమే.. అని అంటున్నారు.

గతేడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్‌, 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగ్గా, బీరు అమ్మకాలు 22.99 లక్షల కేసులు జరిగాయి. లిక్కర్‌ అమ్మకాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నా.. బీరు అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. అయినా మద్యం అమ్మకాల విలువ మాత్రం గత ఏడాది జులైలోని అమ్మకాలతో పోలిస్తే రూ.600కోట్లు పెరిగిందని అంటున్నారు.


Next Story

Most Viewed