మీరు బీటెక్ విద్యార్థులా..? అయితే ఇది మీ కోసమే

by Shyam |
మీరు బీటెక్ విద్యార్థులా..? అయితే ఇది మీ కోసమే
X

దిశ, వెబ్ డెస్క్: మీరు బీటెక్ విద్యార్థులా..? మీరు పరీక్షల గురించి ఆందోళన చెందుతున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి. జేఎన్టీయూ ఓ షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 20 నుంచి 30 వరకు బీటెక్ ఫైనలియర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలకు ఆ షెడ్యూల్ ను పంపించింది. అదేవిధంగా జూలై 16 నుంచి కూడా మొదటి, రెండో, మూడో సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ ను విడుదల చేసింది. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story