రైతుపై ఎలుగుబంటి దాడి…

దిశ, వెబ్‌డెస్క్: రైతుపై ఎలుగుబంటి దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రభు అనే రైతు ఇవాళ పొలం పనులకు వెళ్తుండగా, ఒక్కసారిగా ఆయనపై ఎలుగుబంటి దాడి చేసింది.

ఈ దాడిలో రైతు ప్రభు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు.

Advertisement