మానసిక ఆరోగ్యం కోసం బీచ్ వాక్

by sudharani |
మానసిక ఆరోగ్యం కోసం బీచ్ వాక్
X

దిశ, వెబ్ డెస్క్: నడక ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే అయితే సముద్రతీరాలు, సరస్సులు, నదులు, పౌండ్ల దగ్గర నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది అని చెబుతోంది ఓ అధ్యయనం.

బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇటీవల 59 మంది మీద ఓ పరీక్ష జరిపింది. దీనిలో భాగంగా మొదట వాళ్ళని వారం పాటు రోజూ బీచ్ లో 20 నిమిషాల పాటు వాకింగ్ చేయమని చెప్పారు. మరో వారం సాధారణ రోడ్లమీద వాకింగ్ చేయమన్నారు.

రోడ్ల మీద నడిచినప్పటితో పోలిస్తే.. బీచ్ ఒడ్డున నడిచిన తర్వాత వాళ్ళంతా చురుగ్గా కదులుతూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడటాన్ని గమనించారు. దీని ఆధారంగా మానసిక సమస్యలను అరికట్టడానికి నగరాల్లోని సరస్సుల పక్కన, సముద్రం, నదీ తీరాల్లోనూ వాకింగ్ చేసే వీలుగా వాటిని అభివృద్ధి చేయాలని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed