- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నద్ధంకండి.. కానీ భయం వద్దు : పీఎం
న్యూఢిల్లీ: కరోనావైరస్(కోవిడ్ 19)ను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించుకునే ఉద్దేశంతో సార్క్ దేశాల(ఇండియా, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక) నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రతిపాదన ముందుకు తెచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కరోనావైరస్‌తో పోరాడేందుకు సన్నద్ధంకండి, కానీ దానికి భయపడొద్దని సూచించారు. మన రీజియన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 150 కూడా మించలేదని, భయపడాల్సిందేమీ లేదన్నారు. కానీ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఒక క్రమపద్ధతిలో చర్యలు తీసుకుంటే.. భయాందోళనలు ఉత్పన్నం కావని చెప్పారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మాట్లాడుతూ.. సార్క్ దేశాలు కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు ఒకే పద్ధతిలో టెలి మెడిసిన్‌ను అనుసరిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. కరోనాను ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం కీలకమని, ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ మహమ్మారిని ఎదుర్కోలేదని మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టాలను నివారించేందుకు ఒక మెకానిజంను తయారుచేసుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అన్నారు.
tags : video conference, SAARC, coordination, combat, covid19, coronavirus, PM Modi