ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు ఆ ప్లేయర్స్ కష్టమే

by Shyam |
ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు ఆ ప్లేయర్స్ కష్టమే
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో స్టేడియంలకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నది. అయితే సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. జూన్‌లో నిర్వహిస్తే ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందుకే ఐపీఎల్‌ను గత ఏడాది మాదిరిగా అన్ని క్రికెట్ బోర్డులకు అనుకూలంగా ఉండే తేదీలకు మార్చింది. అయితే అదే సమయంలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజీలాండ్ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా మారే అవకాశం ఉన్నది. ఐపీఎల్‌లో ఆసీస్, కివీస్, కరేబియన్ ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. దీంతో ఆయా దేశాల ఆటగాళ్లు కనుక పాల్గొనక పోతే పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. అందుకే విదేశీ ఆటగాళ్లను ఎలాగైనా ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు తీసుకొని రావాలని బీసీసీఐ ప్రయత్నిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed