- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2021 Phase 2: ఐపీఎల్ పార్ట్-2లో భారీ మార్పులు
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021ని పూర్తి చేయడానికి బీసీసీఐ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నది. ఒకవైపు విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, మరోవైపు ముంచుకొస్తున్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తమకు ఉన్న కొద్ది సమయంలోనే మొత్తం 31 మ్యాచ్‌లను పూర్తి చేయడానికి బీసీసీఐ పనులు వేగవంతం చేసింది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా ఇతర బోర్డు పెద్దలు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రస్తుతం యూఏఈలోనే ఉన్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో బుధ, గురు వారాల్లో జరిపిన చర్చలు సానుకూలంగా సాగడంతో మరికొన్ని రోజుల్లో లీగ్‌కు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. ముందుగా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత స్టేడియంల సిద్దపాటు, లాజిస్టిక్స్ తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే మ్యాచ్‌లు జరిగి ఉంటే షెడ్యూల్ కాస్త భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు తక్కువ సమయంలోనే లీగ్ ముగించాలని నిర్ణయించడంతో షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకోనున్నది.
ఒకే వేదికలో తుది దశ..
ఇండియాలో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు తొలి విడత మ్యాచ్‌లు ముంబై, చెన్నైలో ఆడి ఆ తర్వాత ఢిల్లీ, అహ్మదాబాద్‌కు వెళ్లారు. ఆ విడత సక్రమంగా జరిగి ఉంటే తర్వాత విడత కోల్‌కతా, బెంగళూరులో జరిగేది. ఇక చివరిగా ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో నిర్వహించే వారు. అయితే యూఏఈలో మాత్రం తొలుత మ్యాచ్‌లు మూడు వేదికల్లో నిర్వహించి.. తుది దశతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఒకే వేదికలో నిర్వహించాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19 మధ్యలో ఐపీఎల్ ప్రారంభిస్తారని.. అక్టోబర్ 10 నుంచి 15 లోపు లీగ్ ముగించేస్తారని తెలుస్తున్నది. తొలి విడతలో అబుదాబి, షార్జాల్లో మ్యాచ్‌లు నిర్వహించి.. చివరి దశ, ఫైనల్స్ దుబాయ్‌లో నిర్వహించే అవకాశం ఉన్నది. గత సీజన్‌లో మాదిరి అత్యధిక ఫ్రాంచైజీలు తమ హోటల్ రూమ్స్ దుబాయ్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో తుది దశను కేవలం దుబాయ్‌కి పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. 25 రోజుల్లో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయని తెలుస్తున్నది. ప్లేఆఫ్స్ వరుసగా నిర్వహించి.. ఒక రోజు గ్యాప్‌తో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉన్నది.
ఎందుకంత తొందర..
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉన్నది. అక్టోబర్ 18 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం అయితే అప్పటి కల్లా ఆటగాళ్లు ఇండియా చేరుకోవాలి. అందుకే ఐపీఎల్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించేయాలని బీసీసీఐ భావిస్తున్నది. ఒక వేళ ఇండియాలో కనుక వరల్డ్ కప్ సాధ్యం కాకపోతే యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ నిర్వహించనున్నారు. అదే జరిగితే అక్టోబర్ 1 కల్లా యూఏఈలోని స్టేడియంలను ఐసీసీకి అప్పగించాల్సి ఉన్నది. అయితే ఐపీఎల్ కోసం తమకు ఒక స్టేడియం కావాలని ఐసీసీని బీసీసీఐ అనధికారికంగా కోరినట్లు తెలుస్తున్నది. అందుకే అక్టోబర్ మొదటి వారం నుంచి మ్యాచ్‌లు అన్నీ దుబాయ్ వేదికగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వరల్డ్ కప్‌పై నిర్ణయం తెలియజేయడానికి జూన్ 28 వరకు ఐసీసీ గడువు ఇచ్చింది. అప్పటిలోగా మెగా ఈవెంట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆ తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.