2 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించనున్న బీసీసీఐ

by Shyam |
2 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించనున్న బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : దేశవ్యాప్తంగా అవసరమైన వైద్యశాలలకు 10 లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఎంతో మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది క్రికెటర్లు ఆక్సిజన్ అందించడానికి భారీగా విరాళాలు అందించారు. తాజాగా బీసీసీఐ కూడా ఆక్సిజన్ కొరత తీర్చడానికి నిర్ణయం తీసుకున్నది. ‘గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా వైరస్ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. వైద్యసదుపాయాలు సరిగా లేని, ఆక్సిజన్ కొరత వంటి విషయాలు బయట పెట్టింది. అందుకే తమ వంతు సాయంగా దశల వారీగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించాలని నిర్ణయం తీసుకున్నాము’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story