మరి కొద్ది గంటల్లోనే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్

by Shiva |
మరి కొద్ది గంటల్లోనే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ (UAE) వేదికగా జరగనుంది. ఇప్పటికే జట్లన్నీ యూఏఈ చేరుకున్నా లీగ్ పూర్తి షెడ్యూల్ (Schedule) మాత్రం విడుదల కాలేదు. అబుదాబిలో అమలవుతున్న కఠిన కొవిడ్-19 నిబంధనలు ఆటగాళ్లు నగరాల మధ్యన ప్రయాణానికి కష్టమవుతుండటంతో బీసీసీఐ (BCCI) ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదని సమాచారం.

తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (Emirates Cricket Board) చైర్మన్ షేక్ న్హాయాన్ బిన్ ముబాకర్‌తో బీసీసీఐ (BCCI) వర్గాలు భేటీ అయ్యాయి. యూఏఈ కల్చరల్, యూత్ డెవలెప్‌మెంట్ మంత్రిగా కూడా పని చేస్తున్న బిన్ ముబాకర్‌తో కొవిడ్-19 నిబంధనల వల్ల కలుగుతున్న అసౌకర్యాన్ని వివరించారు. దుబాయ్, అబుదాబి మధ్య ప్రయాణానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆయనను కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ఇంటర్ సిటీ ప్రోటోకాల్స్ (Inter City Protocols) నుంచి ఐపీఎల్ (IPL) క్రీడాకారులు, సిబ్బందికి మినహాయింపు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ‘ప్రస్తుతం యూఏఈలో క్రీడాకారుల ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. మరి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించి.. మరి కొద్ది గంటల్లోనే ఐపీఎల్ (IPL) పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తాం’ అని ఐపీఎల్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

మరోవైపు అబుదాబిలో ఉన్న ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)14 రోజుల క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితిపై కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL Governing Council) యూఏఈ ప్రభుత్వంతో మాట్లాడింది. దీంతో ఆ రెండు జట్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed