- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోతలు, తొలగింపులు తప్పవు : బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కూడా ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోతపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. కోవిడ్-19 (kovid-19) కారణంగా బీసీసీఐ ఆదాయాలు భారీగా తగ్గిపోవడంతో బోర్డు కోతలు, తగ్గింపులపై దృష్టి పెట్టినట్లు బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. త్వరలోనే బోర్డు ఉన్నతాధికారులు సమావేశమై దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.
‘ఇప్పటి వరకు బీసీసీఐ వేతనాల కోతపై చర్చ జరపలేదు. కానీ, భవిష్యత్‌లో తప్పక ఆటగాళ్లు, అధికారులు, సిబ్బంది జీతభత్యాల్లో కోత ఉంటుంది. అయితే ఎవరెవరికి ఎంతెంత కోత విధిస్తారనే విషయం మాత్రం సమావేశం అనంతరం స్పష్టమవుతుంది. కోతలతో పాటు అధిక సిబ్బందిని తొలగించే విషయంపై కూడా చర్చ జరగనుంది’ అని సదరు బీసీసీఐ అధికారి అన్నారు. బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ కూడా గతంలో కోతలు, తొలగింపులపై ఐపీఎల్ (ipl) 13వ సీజన్ ముగిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. గత సీజన్‌తో పోల్చుకుంటే కోవిడ్-19 కారణంగా బోర్డు ఆదాయం గణనీయంగా తగ్గింది.