ఐపీఎల్‌ 2021: వివాదాస్పద రూల్‌కి బ్రేక్

by Shiva |   ( Updated:2021-03-28 00:36:47.0  )
ఐపీఎల్‌ 2021: వివాదాస్పద రూల్‌కి బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే బిగ్గెస్ట్, రిచ్ క్రికెట్ టోర్నీగా పాపులర్ అయిన ఐపీఎల్‌ నిర్వహణకు రంగం సిద్దమైంది. వచ్చే నెల 9వ తేదీ నుంచి క్రికెట్ ప్రేక్షకులు, అభిమానులను ఐపీఎల్ అలరించనుంది. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే మహా ఇష్టం. ఈ టోర్నీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వారు ఎందరో. సిక్స్‌లు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్లు విజృంభిస్తుంటే, బౌలర్లు తమ బౌలింగ్‌తో మాయ చేస్తూ వికెట్లు పడగొడుతుంటే క్రికెట్ ప్రేక్షకులకు వచ్చే కిక్కే వేరు.

ఈ సారి ఐపీఎల్‌లో పలు మార్పులు చేశారు. కొత్త రూల్స్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ రూల్‌ను ఈ ఐపీఎల్‌కు రద్దు చేసింది. గతంలో పలువురు కెప్టెన్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ రూల్‌పై బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ రూల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో సాప్ట్ సిగ్నల్ రూల్‌ను బీసీసీఐ పక్కన పెట్టింది.

అసలు సాప్ట్ సిగ్నల్ వివాదం ఏంటీ?

అంపైర్‌కు ఏదైనా అనుమానం అనిపించినప్పుడు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తాడు. థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేసే సమయంలో తన అభిప్రాయం ఔట్?.. లేదా నాటౌటా? అనేది అంపైర్ చెబుతాడు. థర్డ్ అంపైర్‌కి కూడా సరైన ఆధారాలు దొరకకుండా అనుమానంగా ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఒక్కొక్కసారి ఔట్ లేదా నాటౌట్ అయినా.. అంపైర్ నిర్ణయానికి థర్డ్ అంపైర్ కట్టుబడి ఉంటున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ లాంటి టోర్నీలో ఇలాంటి రూల్‌పై విమర్శలొస్తున్నాయి.

ఐపీఎల్‌లో కొత్త రూల్ ఏంటి?

అనుమానాస్పదంగా అనిపించినప్పుడు అంపైర్‌ నిర్ణయంతో సంబంధం లేకుండా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకునేలా ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్‌ను అమలు చేయనుంది. ఇక ఐపీఎల్‌లో షర్ట్ రన్ రూల్‌లో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ షార్ట్ రన్ ఇచ్చినా.. థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించనుంది.

Advertisement

Next Story