- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెటర్ల గొడవ.. అదేమీలేదంటున్న బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇండియా – న్యూజీలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వాతావరణ కారణాల వల్ల ఆరు రోజుల పాటు జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు వార్తలు వచ్చాయి. మ్యాచ్ మీద కనీసం దృష్టి పెట్టలేదని.. గెలవడానికి కొంచెం కూడా సహకరించలేదని అశ్విన్‌పై విరాట్ విరుచుకుపడినట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కెప్టెన్ కోహ్లీ ప్రవర్తనతో విసిగిపోయిన రవిచంద్రన్ అశ్విన్ వెంటనే బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఒక కథనంలో పేర్కొన్నారు. కోహ్లీ – అశ్విన్ మధ్య విభేదాలు జట్టులో గ్రూపిజానికి తెరతీసిందని.. కోహ్లీకి కొంతమంది సీనియర్లు సహకరించడం మానేశారని.. దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలుస్తున్నది. అంతే కాకుండా బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కోహ్లీకి బీసీసీఐకి చెడిందని అందుకే టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ముందుగానే ప్రకటించారని వార్తలు వచ్చాయి.
అందుకే పక్కకు పెట్టాడా?
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం అశ్విన్‌తో గొడవ జరగడం.. ఆ విషయాన్ని అశ్విన్ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. ఒకటి కరోనా కారణంగా రద్ధైంది. అయితే జరిగిన నాలుగు మ్యాచ్‌లలో కూడా రవిచంద్రన్ అశ్విన్‌ను కెప్టెన్ కోహ్లీ తుది జట్టులోకి తీసుకోలేదు. హెడ్ కోచ్ రవిశాస్త్రీ పిచ్ పరిస్థితుల దృష్ట్యా అశ్విన్‌ను తీసుకోవాలని కోహ్లీకి సూచించాడని.. కానీ, కోచ్ మాట కూడా కోహ్లీ పట్టించుకోలేదని తెలుస్తున్నది. ఆ నాలుగు టెస్టుల్లో కూడా రవీంద్ర జడేజానే తుది జట్టులో కొనసాగించాడు. జడేజా బంతితో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. జట్టు నుంచి మాత్రం తప్పించలేదు. దీనికి అసలు కారణం అశ్విన్‌కు తుది జట్టులో చోటివ్వడం కోహ్లీకి ఇష్టం లేకపోవడమే అని తెలుస్తున్నది. తనపై బోర్డుకు ఫిర్యాదు చేశాడనే కోపంతోనే అశ్విన్‌ను పూర్తిగా పక్కకు పెట్టాడని సమాచారం. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత అశ్విన్‌ను టీ-20 జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేయడం కూడా కోహ్లీకి రుచించలేదని తెలుస్తున్నది.
గొడవలపై బీసీసీఐ క్లారిటీ..
టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలు ఉన్నాయని.. కోహ్లీపై ఫిర్యాదులు అందాయన్న వార్తలపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ ఒత్తిడి తెచ్చిందనే విషయంపై కూడా స్పందించింది. ‘టీ-20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం పూర్తిగా కోహ్లీ వ్యక్తిగతం. టీమ్ ఇండియా విజయవంతమైన కెప్టెన్లలో కోహ్లీ ఒకడు. అతడిని కెప్టెన్సీ వదిలేయాలని బీసీసీఐ ఏనాడూ ఒత్తిడి చేయలేదు. జట్టులో సీనియర్ల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు. సీనియర్ల విభేదాల వల్లే మెంటార్‌గా ధోనీని నియమించారనే ఆరోపణను కూడా ఆయన ఖండించారు. టీ-20ల్లో ఎంఎస్ ధోనీ ఒక గొప్ప కెప్టెన్ అని.. టీమ్ ఇండియాకు రెండు వరల్డ్ కప్‌లు, రెండు ఆసియా కప్‌లు, ఒక చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఆయన సొంతం. అతడు జట్టుతో ఉంటే మంచి స్ఫూర్తిని ఇస్తాడనే మెంటార్‌గా నియమించామని.. ఇందులో ఇతరనులను కించపరిచే విషయం ఏమీ లేదని దుమాల్ స్పష్టత ఇచ్చాడు.
- Tags
- Arun Dhumal
- Bcci