ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ 13 (IPL 13)వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ (Defending champion) ముంబై ఇండియన్స్ (MI), రన్నరప్ (Runnerup) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య అబుదాబీ వేదికగా సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ జరుగనుంది.

అబుదాబిలో తొలి మ్యాచ్ జరిగిన అనంతరం తర్వాత రోజు దుబాయ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. సోమవారం మూడో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరుగుతుంది. ప్రతీ రోజు మ్యాచ్ రాత్రి. 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. రెండు మ్యాచ్‌లు ఉన్న సమయంలో మొదటి మ్యాచ్ 3.30 గంటలకు, రెండో మ్యాచ్ 7.30 గంటలకు నిర్వహిస్తారు. దుబాయ్‌లో 24 మ్యాచ్‌లు, అబుదాబీలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ వేదికను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ (BCCI) పేర్కొంది.

Advertisement