- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పూలే విగ్రహం ధ్వంసం… నిందితులను కఠినంగా శిక్షించాలి

X
దిశ, సూర్యాపేట: మహనీయుల విగ్రహాలకు రాష్ట్రం, దేశంలో రక్షణ లేకుండాపోయిందని బీసీ యువజన సంఘం నాయకులు కేశవరపు నవీన్ అన్నారు. మంగళవారం ఆయన సూర్యాపేట పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ… వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉర్స్ కరీమాబాద్‌లో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం సిగ్గుచేటని, పూలే విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న దుండగులను గుర్తించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Next Story