అందులో చేర్చి.. మెరుగైన వైద్యం అందించాలి

by  |
అందులో చేర్చి.. మెరుగైన వైద్యం అందించాలి
X

దిశ, ఎల్బీనగర్: కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని బీసీ ట్రేడ్ యూనియన్ హైదరాబాద్ కన్వీనర్ బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. బీసీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో పొరుగు రాష్ట్రాలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

తెలంగాణలో కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఒక్కొక్క బాధితుడి వద్ద రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు రూ. 5వేలు ఆర్థికసాయం అందించాలని, చేతి వృత్తిదారులకు రూ.20 వేలు ఆర్థిక ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పేదలకు కావాల్సిన నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా అందించాలన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో హైడ్రోక్లోరిడ్ ద్రావణాలను పిచికారీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.



Next Story

Most Viewed