- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీసీ కులాలకు న్యాయం చేస్తాం: ఆచారి
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన 26కులాలకు న్యాయం చేస్తామని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తళ్లోజు ఆచారి హామీ ఇచ్చారు. 26 కులాలను తొలగించడం చట్ట రీత్యా చెల్లుబాటు కాదని, సీఎం కేసీఆర్ అనాలోచితంగా, అసంబద్ధంగా ఆ కులాలను తొలగించారని వ్యాఖ్యానించారు. 26కులాలను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ‘ 26 బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫిక్కి హాల్‌లో ఆదివారం ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల జాతీయ స్థాయిలో వారు ఒబిసి రిజర్వేషన్ కోల్పోయారని, ఈ విషయంపై బిసి జాతీయ కమిషన్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తొలగించిన 26బీసీ కులాలకు న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జాతీయ బిసి కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని ఆయన కోరారు. రాజ్యాంగ బద్దమైన బిసి కమిషన్‌కు బడ్జెట్, సరైన కార్యాలయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.