- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పబ్‌జీ లవర్లకు ఊహించని షాక్.. బ్యాటిల్ గ్రౌండ్స్‌లో ప్లేయర్ల తొలగింపు

X
దిశ, వెబ్‌డెస్క్: విశ్వవ్యాప్తంగా యువతను విశేషంగా ఆకర్షించిన పబ్‌జీ గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అచ్చం అదే తరహాలో మన దేశంలో కూడా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో గేమ్ యాప్‌ను క్రాఫ్టన్ కంపెనీ వారు లాంచ్ చేశారు. ఇప్పటికే దాదాపు 48 మిలియన్ల మంది గేమ్ డౌన్‌లోడ్ చేసుకొని ఆడుతున్నారు. ఇదే క్రమంలో బ్యాటిల్ గ్రౌండ్ యూజర్లపై నిఘా వేసిన క్రాఫ్టన్ సంస్థ పలువురు హ్యాకర్లు(చీటింగ్‌కు పాల్పడిన యూజర్లను) గుర్తించింది. జులై 30 నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు గేమ్ ఆడుతూ చీటింగ్‌కు పాల్పడిన 3,36,736 మందిని గుర్తించి బ్యాన్ చేసింది. భవిష్యత్తులో కూడా సదరు యూజర్ బ్యాటిల్ గ్రౌండ్స్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకోకుండా బ్లాక్ చేసినట్టు క్రాఫ్టన్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో సదరు యూజర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Next Story