- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణి బ్లాస్టింగ్‌తో చంపేస్తున్నారు.. కాపాడండి..!
దిశ, ఇల్లందు: సింగరేణిలో జేకే ఓసీ బ్లాస్టింగ్ కారణంగా చుట్టుపక్కల బస్తీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బిక్కు బిక్కుమంటూనే బతుకులు వెళ్లదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణితో తీవ్ర అనారోగ్యంతో పాటు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జనరల్ మేనేజర్‌కు విన్నవించినా స్పందించడం లేదని.. నామమాత్రంగా వైబ్రేషన్ మీటర్ రీడింగ్ ఏర్పాటు చేసి.. బ్లాస్టింగ్ రీడింగ్‌ను తక్కువగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను మాత్రం చెప్పడం లేదని.. బ్లాస్టింగ్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు. గతేడాది స్టేషన్ బస్తీలోనే వాయు కాలుష్యంతో 35 మరణాలు సంభవించాయని.. మరో 30 మంది తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు గురయ్యారని చెబుతున్నారు. ఒక్కసారి మెడికల్ క్యాంపు పెట్టి పరీక్షలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితి బయటపడుతోందంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి స్టేషన్ బస్తీ ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టానికి పూర్తి బాధ్యత వహించాలని.. ఇందుకోసం వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.