దవాఖానా బస్తీకొచ్చింది

by  |
దవాఖానా బస్తీకొచ్చింది
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. హబ్సీగూడలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను శుక్రవారం మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 168 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-95, రంగారెడ్డి జిల్లాలో-32, మేడ్చల్ జిల్లాలో -40, సంగారెడ్డి జిల్లాలో 3 చొప్పున ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా హైదరాబాద్ లో 18, మేడ్చల్ 6, రంగారెడ్డిలో 2 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. బస్తీ దవాఖానాలతో ప్రతిరోజూ సుమారు 14 వేల మందికి వైద్యసేవలు అందనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జ్వరం వస్తే అశ్రద్ధ చేయొద్దని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి జబ్బు వచ్చినా బస్తీ దవాఖానాల్లో మందులు అందుబాటులోకి ఉంటాయని పేర్కొన్నారు.


Next Story