- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో : జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్ పే అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు గురువారం మంత్రి హరీశ్ రావును కలిసేందుకు బీఆర్కే భవన్ కు వెళ్లారు. కాగా ఈ జీవో(104, 105, 106)కు సంబంధించిన కాపీలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి సమక్షంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కాంట్రాక్ట్ లెక్చరర్లకు అందజేశారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇదిలా ఉండగా బేసిక్ పే జీవో విడుదల చేసినందుకు కాంట్రాక్ట్ లెక్చరర్లు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ చైర్మన్ కనక చంద్రం, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేశ్, రాష్ట్ర మహిళా సెక్రెటరీ మాలతి, డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల అధ్యక్షుడు వినోద్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షుడు ఉమా శంకర్, నాయకులు సదానందం, త్రి భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.