- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ ట్రయల్స్ అనుమతికి భారత్ బయోటెక్ దరఖాస్తు
న్యూఢిల్లీ: తాము అభివృద్ధి చేస్తున్న నాజల్ వ్యాక్సిన్(ముక్కు ద్వారా వేసే టీకా) ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ భారత రెగ్యులేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ప్రతిపాదనలు పంపింది. ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందిన విషయం విధితమే. కొవాగ్జిన్ కాకుండా కరోనాను ఎదుర్కొనే నాజల్ వ్యాక్సిన్‌నూ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ. కృష్ణ మోహన్ తెలిపారు.
ఈ టీకా మొదటి, రెండో ట్రయల్స్ నాగ్‌పూర్‌లోని గిల్లుర్కార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. డీసీజీఐ నుంచి అనుమతులు రాగానే హైదరాబాద్, నాగ్‌పూర్, పూణె, భువనేశ్వర్‌లలో 30 నుంచి 45 మంది ఆరోగ్యవంతులైన పార్టిసిపెంట్లపై ఈ టీకా ట్రయల్స్ నిర్వహించనుంది. అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నామని, కరోనాను ఎదుర్కోవడానికి ముక్కు ద్వారా టీకా వేసే పద్ధతి ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పినట్టు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.