ఆ 59 చైనా యాప్స్‌.. ఇంకా పనిచేస్తున్నాయి

by  |
ఆ 59 చైనా యాప్స్‌.. ఇంకా పనిచేస్తున్నాయి
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రతా కారణాల దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ యాప్స్‌లో కొన్నింటికి ఇప్పటికీ వెబ్‌సైట్స్ ఉన్నట్లు తెలిసింది. బెంగళూరుకు చెందిన కొంతమంది పరిశోధకులు బ్యాన్ అయిన చైనా యాప్స్‌పై ఇటీవలే ఓ అధ్యయనం చేపట్టగా.. అందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆ 59 చైనా యాప్స్‌లో 33 పూర్తిగా బ్లాక్ కాగా, 26 అప్లికేషన్లకు సొంతంగా వెబ్‌సైట్లు ఉన్నట్లు తేలింది. వాటిల్లో తొమ్మిది పూర్తిగా పని చేస్తుండగా.. 11 పార్షియల్‌గా పని చేస్తున్నాయి. మరో 6 పనిచేయడం లేదు.

పరిశోధకులు సిటీ ఫైబర్‌నెట్ ద్వారా వెబ్‌సైట్ యాక్సెసబిలిటీని టెస్ట్ చేశారు. ఆ టెస్టులో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, హలో, లైక్ వంటి కొన్ని వెబ్‌సైట్లు పూర్తిగా బ్యాన్ అయినట్లు తెలిసింది. అయితే.. 39 అప్లికేషన్లు మాత్రం సొంతంగా వెబ్‌సైట్లు లేదా వెబ్ పేజెస్ కలిగి ఉన్నాయి. వాటిల్లో 13 బ్లాక్ కాగా.. మిగిలిన యాప్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అవన్నింటినీ ఓ వెబ్ బ్రౌజర్‌తో ఢిల్లీలోని స్థానిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISPలు)ను ఉపయోగించి యాక్సెస్ చేసుకునే వీలుందని తెలిపారు. అయితే, ఇతర ISPలను ఉపయోగించినప్పుడు యాక్సెసబిలిటీ కావచ్చు, కాకపోవచ్చని తెలిపారు.

నిజానికి ‘డేటా ప్రొటెక్షన్ కోసమే ఆ యాప్స్‌పై బ్యాన్ విధించారు. అలాంటప్పుడు వాటిని పూర్తిగా నిషేధించాలి. కానీ ఇప్పటికీ యూజర్లు.. చైనా వెబ్‌సైట్లను యాక్సెస్ చేసుకోవడం వల్ల భారత ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరనట్లే కదా? కొందరు టెలికామ్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ వెబ్‌సైట్లను బ్లాక్ చేశారు. కానీ బ్యాన్ విధించిన విధానం అంతటా ఒకలా లేదు’ అని పరిశోధకుల్లో ఒకరైన కృష్ణ తెలిపారు.


Next Story

Most Viewed