- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాంకుల జీఎన్‌పీఏ పెరిగే అవకాశం : ఆర్‌బీఐ !
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(జీఎన్‌పీఏ) 2020 సెప్టెంబర్‌లో ఉన్న 7.5 శాతం నుంచి 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని ఆర్‌బీఐ తన ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో తెలిపింది. స్థూల ఆర్థిక వాతావారణం తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోకి మారితే జీఎన్‌పీఏ నిష్పత్తి 14.8 శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) జీఎన్‌పీఏ నిష్పత్తి 2020, సెప్టెంబర్‌లో 9.7 శాతంగా ఉంది.
ఇది 2021, సెప్టెంబర్ నాటికి 16.2 శాతానికి పెరగవచ్చని పేర్కొంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల(పీవీబీ) నిరర్ధక ఆస్తులు 4.6 శాతం నుంచి 7.9 శాతానికి, విదేశీ బ్యాంకుల(ఎఫ్‌బీ) నిరర్ధక ఆస్తులు 2.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరుగుతాయని నివేదిక తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల నేపథ్యంలోనే పీఎస్‌బీ, పీవీబీ, ఎఫ్‌బీల జీఎన్‌పీఏ నిష్పత్తులు పెరగవచ్చని పేర్కొంది. ఈ జీఎన్‌పీఏ అంచనాలు మూలధన ప్రణాళికలో ఉండే చిక్కులతో పాటు బ్యాంకుల ఆర్థిక బలహీనతను సూచిస్తాయని ఆర్‌బీఐ ఎఫ్ఎస్ఆర్ నివేదిక వెల్లడించింది.