బ్యాంకులకు నిరర్ధక ఆస్తుల భారం తప్పదు!

by Harish |   ( Updated:2020-04-06 06:31:47.0  )
బ్యాంకులకు నిరర్ధక ఆస్తుల భారం తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 కోరల్లో బ్యాంకింగ్ రంగం చిక్కుకోనుందా? తీవ్రమైన సంక్షోభానికి ఆర్థికవ్యవస్థ లోనవుతుందనే సంకేతాలతో బ్యాంకింగ్ రంగంలో ఆందోళన పెరుగుతోంది. దీర్ఘకాలం కరోనా ప్రభావం ఉంటుందనే అంచనాల మధ్య ఈ ఏడాది నిరర్ధక ఆస్తులు భారీగా పెరుగుతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వారు నివేదిక ఇచ్చారు. దీంతో పాటు బ్యాంకులు ఇచ్చే రుణ వ్యయం కూడా మరింత భారమవుతుందనే సమాచారం వినిపిస్తోంది.

‘ఏసియా-పసిఫిక్ బ్యాంక్స్-కోవిడ్19 క్రైసిస్’ అనే పేరుతో వెల్లడించిన నివేదిక ప్రకారం..2020కి బ్యాంకుల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 1.9 శాతం, రుణ వ్యయాల నిష్పత్తి 130 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా వేసింది. కరోనా వ్యాప్తి వేగంగా, వ్యాపించడమే కాకుండా సుధీర్ఘంగా కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం ఉంటుందని, దీనివల్ల బ్యాంకు సంస్థల రుణ సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ఇటీవల కరోనా వ్యాప్తి వల్ల ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ముఖ్యంగా పలు సర్దుబాట్లతో రూ. 3.74 లక్షల కోట్లను మార్కెట్లలో చొప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఏజెన్సీ అంచనాల ప్రకారం..ఆర్‌బీఐ తీసుకునే చర్యలు వాస్తవంగా ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని, ప్రయత్నించినప్పటికీ ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదిక అభిప్రాయపడింది.

Tags: Banks, Coronavirus, Covid-19, India, NPA

Advertisement

Next Story

Most Viewed