- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కౌంటింగ్‌లో బ్యాంక్, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు
దిశ ప్రతినిధి, మేడ్చల్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొంటుంది. ఎన్నికల విధుల్లో టీచర్లను నియమించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో తొలి రౌండ్ పూర్తి ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం అవుతోంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల కోసం ప్రతి డివిజన్ కు ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ లో తొలి రౌండ్ లో వెయ్యి ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఎన్నికల విధులపై అవగాహన లేని వారిని నియమించడంతో ఓట్ల లెక్కింపు గందరగోళంగా తయారైందని పలువురు ఏజెంట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బ్యాంక్, కార్పొరేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులను ఈసారి ఎన్నికల విధుల్లో నియమించారు. తొలిసారి ఎన్నికల విధులను నిర్వహించడంతో ఆయా ఉద్యోగులకు ఓట్ల లెక్కింపు విషయంలో తడబాటును ప్రదర్శిస్తున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రంలో ఫలితాల కోసం వెచి చూస్తున్న ఏజెంట్లు, అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.