బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించొచ్చు!

by  |
బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించొచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రస్తుత సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలానికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ 30 శాతం క్షీణిస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ హెచ్చరించింది. కీలక వడ్డీ రేటును రికార్డు స్థాయిలో 0.1 శాతం కొనసాగిస్తున్నామని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పరపతి విధాన కమిటీ వెల్లడించింది. బాండ్‌ల కొనుగోలు పథకాన్ని కొనసాగిస్తున్నామని, తొలి సగంలో ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణిస్తుందని, నిరుద్యోగిత భారీగా పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వం ‘జాబ్ రిటెన్షన్ స్కీమ్‌’తో సంస్థలు సిబ్బందిని అలాగే ఉంచుకున్నప్పటికీ నిరుద్యోగిత రేటు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఈడాది మొత్తం బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ 14 శాతం క్షీణిస్తుందని, లాక్‌డౌన్ నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కంపెనీల విక్రయాలు రెండో త్రైమాసికంలో 45 శాతం తక్కువగా నమోదవుతుందని, దీనికి వినియోగదారుల విశ్వాసం క్షీణించడమే అని వివరించింది. పెట్టుబడులు 50 శాతం తగ్గనున్నట్టు ఇంగ్లాండ్ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడుతోంది.

Tags: England, UK, jobs retention scheme, Bank of england


Next Story