రుణ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా!

by Harish |
రుణ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా బుధవారం నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (MCLR)ను 0.05 శాతం తగ్గించింది. తగ్గించిన ఎంసీఎల్ఆర్ అన్ని కాల వ్యవధుల రుణాలపై నవంబర్ 12 నుంచి అమ్మల్లోకి రానున్నట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ సవరణతో గృహ రుణాలు మరింత చౌకగా లభించనున్నాయని బ్యాంక్ పేర్కొంది. ఆటో, రిటైల్, గృహ రుణాల వినియోగదారులకు రుణాలు 7.5 శాతం నుంచి 7.45 శాతానికి తగ్గింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌లు 6.60-7.30 శాతం మధ్య తగ్గించబడినట్టు బ్యాంకు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed