Banking Frauds : 25 శాతం తగ్గిన బ్యాంకు మోసాలు!

by Harish |   ( Updated:2021-05-27 10:30:07.0  )
Banks
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు విలువ పరంగా 25 శాతం తగ్గి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన బ్యాంకు మోసాలు విలువ పరంగా రూ. 1.85 లక్షల కోట్లు. సంఖ్య పరంగా 15 శాతం క్షీణించి 7,363కు చేరుకున్నాయి. మొత్తం మోసాల్లో 59 శాతానికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మోసాలు రూ. 81,901 కోట్లుగా ఉండగా, ప్రైవేట్ బ్యాంకుల మోసాలు 33 శాతం తగ్గి రూ. 46,335 కోట్లుగా నమోదయ్యాయి. రుణాల పోర్ట్‌ఫోలియోలో సంఖ్య, విలువ పరమైన మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఆన్‌లైన్ మోసాల సంఖ్య 34.6 శాతం పెరిగాయి.

Advertisement

Next Story