TS: మారిన ఆర్టీసీ, బ్యాంక్ టైమింగ్స్

by Shyam |
TS: మారిన ఆర్టీసీ, బ్యాంక్ టైమింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ‌లో నేటి నుంచి ఆర్టీసీ స‌ర్వీసుల స‌మ‌యాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జిల్లాల‌కు ఆర్టీసి బ‌స్సు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేటి నుంచి తెలంగాణ‌లో 3600 బ‌స్సులు నడుస్తాయని, హైద‌రాబాద్‌లో 800 సిటీ బ‌స్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా నిన్నటివరకు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బస్సులు నడిచేవి. జిల్లాలకు చేరుకునే బస్సులు ఆ సమయం కంటే ముందే చేరుకునేవి.

నేటి నుంచి తెలంగాణలో కొత్త లాక్ డౌన్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. నిన్నటితో ముగిసిన లాక్ డౌన్‌ను పది రోజుల పాటు పొడిగించిన ప్రభుత్వం.. నేటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సులు సాయంత్రం 6 వరకు తిరగనున్నాయి. ఇక ప్రభుత్వం సడలింపుల నేపథ్యంలో బ్యాంకు టైమింగ్స్ కూడా మారాయి. గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed