నిబంధనలు ఉల్లంఘన.. రూ.కోటి జరిమానా

by  |
నిబంధనలు ఉల్లంఘన.. రూ.కోటి జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, పలు దేశాలన అతలాకుతలం చేసింది. దీంతో మానవ జీవన విధానంలో అనేక మార్పులు జరిగాయి. మాస్క్ లేనిదే బయటకు వచ్చేందుకు చాలా మంది భయపడుతున్నారు. మహమ్మారి నుంచి ఎవరిని వారు కాపాడుకోవడానికి మాస్క్ తప్పని సరి అని వైద్యులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా కొందరు వీటిని పట్టించుకోకుండా మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కోవిడ్ నిబంధనలకు విఘాతం కలగడమే కాకుండా, వీరి వల్ల కరోనా వ్యాపించడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో, మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారిపై జరిమానాలను కూడా విధిస్తున్నారు.

ఈ క్రమంలో మాస్క్ లేని వారిపై బెంగళూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ.కోటి జరిమానా విధించారు. జూన్ 9 నుంచి జులై 10 వరకూ మొత్తం రూ.1.01 కోట్లను వసూలు చేశారు. వీటిలో 46,959 కేసులు మాస్కులు ధరించనందుకు… 3,747 కేసులను సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు విధించారు. బెంగళూరు పోలీసులు, నగర మున్సిపల్ అధికారులు జాయింట్ టీమ్‌గా ఏర్పడి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.



Next Story